- వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్ : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గంగాధర, మంగపేట, ఇస్లాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలను నమోదు చేసుకొని తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని, సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, వైస్ చైర్మన్లు తోట కరుణాకర్, వేముల భాస్కర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రామ్, కాంగ్రెస్ నాయకులు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, పడాల రాజన్న, సాగి అజయ్ రావు, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, రోమాల రమేష్, గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, రాచమల్ల భాస్కర్, మంత్రి మహేందర్, గంగాధర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


