epaper
Thursday, April 9, 2026
epaper

ప్రసూతులపై నిర్లక్ష్యం వద్దు

ప్రసూతులపై నిర్లక్ష్యం వద్దు
గర్భిణీలు ఉచిత సేవలు వినియోగించుకోవాలి
ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో ఎమ్మెల్యే నాగ‌రాజు
సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం
తల్లి శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌

కాకతీయ, వరంగల్ : ఆసుపత్రులకు ప్రసూతి కోసం వచ్చే మహిళల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీకేఎం ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందిస్తేనే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి శిశు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు, పోషకాహారం, సమయానికి వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

తల్లి శిశు సంక్షేమమే లక్ష్యం

ప్రతి కుటుంబం ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. వృద్ధ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని, వారి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ బాల్య వివాహాలు తల్లి శిశు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఆడపిల్లలకు విద్య, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజంలో లింగ వివక్షత కారణంగా జరుగుతున్న భ్రూణహత్యలను అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యకరమైన మాతృత్వానికి సూచనలు

సురక్షిత మాతృత్వానికి సరైన వయస్సు ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలు ఒత్తిడి లేకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భధారణల మధ్య విరామం అవసరమని చెప్పారు. గర్భంలో లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన పెంచడం ద్వారా మంచి అలవాట్లు ఏర్పడతాయని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సి కే ఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణీలకు నిర్దేశిత విధంగా పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి ముందు ఆసుపత్రి వార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి సందర్శించారు. గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముల్కనూర్ స్టేష‌న్‌ను త‌నిఖీ చేసిన సీపీ

ముల్కనూర్ స్టేష‌న్‌ను త‌నిఖీ చేసిన సీపీ కాకతీయ, హన్మ‌కొండ : వరంగల్ పోలీస్...

మార్కెట్ లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

మార్కెట్ లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి మల్లేశం కాకతీయ,...

ఎంపీ వద్దిరాజుకు “అక్షర కానుక”

ఎంపీ వద్దిరాజుకు "అక్షర కానుక" కాకతీయ, ఇనుగుర్తి : బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ...

ఎంజీఎంలో ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ సేవలు భేష్

ఎంజీఎంలో ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ సేవలు భేష్ ఉత్తమ సేవలందిచిన వారికి పురస్కారాలు కాకతీయ, వరంగల్...

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతమ్ రెడ్డి కాకతీయ, గీసుగొండ...

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు ఆరు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్...

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : మండలం లోని...

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం సుస్థిర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img