epaper
Sunday, March 1, 2026
epaper

పరీక్షలపై నిర్లక్ష్యం వద్దు

పరీక్షలపై నిర్లక్ష్యం వద్దు
ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గురుకులాల ప్రిన్సిపల్స్‌తో మంత్రి పొన్నం జూమ్ మీటింగ్‌లో స‌మీక్ష‌

కాకతీయ, హైదరాబాద్: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల పనితీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించారు. పరీక్షల సన్నద్ధత, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల కార్యాచరణపై ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, గురుకులాల కార్యదర్శి సైదులు, ప్రిన్సిపల్స్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. గత ఏడాది తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలలు ఈసారి తప్పనిసరిగా మెరుగైన ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫలితాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక గ్రూపులుగా విభజించి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. బట్టి విధానానికి బదులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని, రోజువారీ రివిజన్ చేయించాలని చెప్పారు. ఈ ఏడాది 294 గురుకులాల్లో 19,255 మంది పదో తరగతి విద్యార్థులు, 261 కళాశాలల్లో 26,812 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు వివరించారు. గత ఏడాది ఎస్సెస్సీలో 147 పాఠశాలలు, ఇంటర్‌లో 11 కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి 15 రోజులకు మెడికల్ చెకప్‌లు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష భయాన్ని తగ్గించేందుకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలన్నారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img