హిందూ పండుగలకు ఆంక్షలు పెట్టొద్దు
: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలో వినాయక మండపాలను ఏర్పాటు చేయు భక్త మండలి ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా నిర్వహించడం కోసం పోలీస్ యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని వరంగల్ ఏసిపి కి వినతి పత్రం తో విజ్ఞప్తి చేశారు.
అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలో అనేక సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, వినాయక చవితి పండుగను యూత్ అసోసియేషన్లు , భక్తమండలి , కాలనీ సంఘాలు కమిటీలుగా ఏర్పడి వారి వారి ప్రాంతాలలోని ప్రధాన కూడళ్లలో మండపాలను ఏర్పాటు చేసి, నవరాత్రులు పూజలు చేసి హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కావున వారి వారి ప్రాంతాలలో ఏర్పాటు చేసే మండపాలకు ఎటువంటి అసౌకర్యం ఆటంకాలు జరగకుండా తగిన వసతులు కల్పించి భక్తి భావంతో వినాయక చవితి నవరాత్రులు దిగ్విజయంగా జరుగుటకు అన్ని విధాల సహకరించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా తరఫున కోరామన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా బైరి నాగరాజు లు పాల్గొన్నారు.


