కాకతీయ కొత్తగూడ : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై కొత్తగూడ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మంగళవారం తహసీల్దార్ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని పలు సూచనలు చేశారు . ధాన్యం మద్దతు ధర రైతులకు అర్థమయ్యే విధంగా తెలియజేసే బోర్డులను కొనుగోలు కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వరి ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పలీన్ లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని, గోనే సంచులు ముందుగానే సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు,ఏపీఎం శ్రీనివాస్, ఆర్.ఐ పరమేష్, పీఏసనీఎస్ సీఈవో వెంకన్న, జీసీసీ మేనేజర్, జీపీవోలు, సెంటర్ ఇన్చార్జి లు, ట్యాబ్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


