epaper
Thursday, January 15, 2026
epaper

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు
*మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి విడత, రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామపంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ పంచాయతీరాజ్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 5,856 గ్రామాలకు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. గత రెండేళ్లుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ, అక్కడే అది ఆగిపోయిందన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు రావాలంటే మార్చిలోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించామని స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పరిపాలన, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్రులు కూడా విజయం సాధించారని మంత్రి తెలిపారు. స్థానిక సమస్యల కారణంగా కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ రెబల్స్ నాలుగు గ్రామాల్లో గెలుపొందారని పేర్కొన్నారు. ఇది ములుగు నియోజకవర్గ ప్రజల విజయం అని, కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడి విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందని, దీనిని సహించలేక కొందరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా “సీతక్క గడ్డమీద షాక్” అనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి సొంత గ్రామమైన దేవగిరిపట్నంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, కాల్వపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ గెలిచిందని ఆమె గుర్తు చేశారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించినందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకుని ప్రజల అభివృద్ధికి సహకరించి కనీస రాజకీయ మర్యాద పాటించాలని మంత్రి సీతక్క హితవు పలికారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ బొక్కా సత్తి రెడ్డి, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img