దళారులను నమ్మి మోసపోవద్దు..
రైతులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు కలెక్టర్ సూచనలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, నల్లబెల్లి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ డా,, సత్య శారదా అన్నారు. శనివారం నల్లబెల్లి మండలం గోవిందాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో, రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని తొందరగా తూకం వేసి రైస్ మిల్లులకు పంపాలన్నారు. రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్స్ కవర్స్ కప్పే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ట్యాబ్ లో రైతుల వివరాలు నమోదు చేసి వారి అకౌంట్లో తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిచారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. క్రమపద్ధతిలో తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని రైతులు నియమాల ప్రకారం తేమ శాతం వచ్చేలా చూడాలని సూచించారు. ధాన్యాన్ని ప్యాడి క్లీనర్లలో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఎఓ అనురాధ, డిఎం సివిల్ సప్లైస్ సంధ్యారాణి, డి ఎస్ ఓ కిష్టయ్య, తహసీల్దార్ కృష్ణ, ఏఓ రజిత తదితరులు పాల్గొన్నారు.


