- ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధర పొందాలి
- తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి వెల్లడి
కాకతీయ తుంగతుర్తి : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నల్గొండ జిల్లా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి మరియు గొట్టిపర్తి గ్రామాలలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కల్లాల వద్ద 17% తేమ వచ్చే విధంగా ఆరబెట్టుకొని, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా ఏ గ్రిడ్ వరి ధాన్యానికి 2389,రూపాయలు బి గ్రేడ్ వరి ధాన్యానికి 2369, రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు. అదేవిధంగా మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు, సన్న రకాలకు అదనంగా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి దయానందం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ కమిటీ సభ్యులు వాసం వెంకన్న,రైతులు, ఆమానీలు, పాల్గొన్నారు


