- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం ఆయన బెజ్జంకి మండలం తోటపల్లి, ముత్తన్నపేట, కల్లేపల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యానికి చెల్లింపులు నిర్ణీత గడువులోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, గూడెల్లి శ్రీకాంత్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.


