- రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకోవాలి
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
కాకతీయ, తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేలుప్రారంభించి మాట్లాడారు. ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దళారుల మాటలు విని తొందరపడి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని సూచించారు. కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ధాన్యాన్ని విక్రయించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాధాన్యాన్ని విక్రయించి బోనస్ పొందవచ్చునన్నారు. త్వరలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో టిఎస్పిఎస్సి చైర్మన్ గుడిపాటి సైదులు, వైస్ చైర్మన్ శ్రీలత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డైరెక్టర్లు, ఎమ్మార్వో దయానందం, సీఈవో యాదగిరి, ఏఈఓ జోత్స్న తదితరులు పాల్గొన్నారు.


