మళ్లీ మోసపోవద్దు.. గోస పడొద్దు..
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
కాకతీయ, నెల్లికుదురు : అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మరోసారి మోస పోయి గోస పడవద్దని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పిలుపు నిచ్చా రు. మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలం లోని ఆలేరు గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీరామ్ సత్యనారాయణ తరపు న గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామపంచా యతీ ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు లో విఫలమైందని, పంచా యతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహి ళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశా రని, కానీ, పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వలేదన్నారు.ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళ లు గ్రహించాలని కోరారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆద ర్శంగా నిలిపారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ ల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శిం చారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని అన్నారు. కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి పదేళ్ల తన పాలనలో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. సబ్బం డ వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిని కాదనుకొని ఓ మాయలోడిని తీసుకొచ్చి సీటులో కూర్చో బెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం, అభి వృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేద న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీరామ్ సత్యనారాయణ మరియు వారి వార్డుల అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


