- ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబానికి
డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ - ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా..
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
- పూరన్ భార్య ఐఏఎస్ అమనీత్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి
- బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : చండీగఢ్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
న్యాయంచేయండి
పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో తో డిప్యూటీ సీఎం.. సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు, పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగి తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.


