నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు
మానవత్వం మిగిలే ఉందని చాటిన ఖిలావరంగల్ ప్రజలు
కాకతీయ, ఖిలావరంగల్: ఖిలావరంగల్ తూర్పు కోటకు చెందిన సంకతల కోమల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని రేపింది. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించడంతో కోమల ఒక్క కుమారుడిని పెంచుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించింది. పెఱిక కులానికి చెందిన ఈ నిరుపేద మహిళకు ఉండటానికి కూడా సరైన ఇల్లు లేకపోవడం గ్రామస్తులను మరింత కలచివేసింది.
ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ నాయకుడు కందిమల్ల మహేష్ ముందుకు వచ్చి తన వంతుగా ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా బాధితుడి పరిస్థితిని స్థానిక దాతలకు వివరించి, వారిని చేల్చి మొత్తం ₹50,000 వరకు సేకరించారు. సేకరించిన మొత్తాన్ని మంగళవారం రోజు కోమల కుమారుడికి అందజేస్తూ కుటుంబానికి కొంతమేర అండగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి స్పందించిన దాతలు:
మెడిశెట్టి రాజేష్,అరసం రాంబాబు, బోలుగొడ్డు శ్రీనివాసు, బిల్లా కిషోర్, బండి కృష్ణ, వనపర్తి ధర్మరాజు, బిల్లా భగత్,చింతం ఉమేష్, బేర నరేందర్, ఏసిరెడ్డి రమేష్, ఉన్నారు.
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వంని చాటిన దాతల సేవ మనస్సు స్థానికంగా ప్రశాంసలు అందుకొంటున్నారు


