కాకతీయ, గీసుగొండ: ఆంజనేయ స్వామి ఆలయ ప్రహారీ నిర్మాణానికి జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి రూ.3 లక్షల విరాళం అందజేశారు. మండలంలోని కొమ్మాల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రహారీ నిర్మాణానికి బాల కిషోర్ రెడ్డి విరాళం అందజేయగా, ప్రహారీ నిర్మాణ పనులను పార్టీ నాయకులు రడం భరత్ కుమార్, వీరగోని రాజ్ కుమార్, అల్లం మర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో బోగి శ్రీను, పేర్ల శ్రావణ్ కుమార్, మంద అనిల్, కొమ్మాల గ్రామస్తులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


