మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన
దాడికి యత్నించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్
కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : వైద్యులపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ ఆస్పత్రి వైద్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నల్లెల్ల గ్రామానికి చెందిన పలువురు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రాగా, వైద్యులు ఆసమయంలో వైద్యులు డ్యూటీలో లేరంటూ , సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఈక్రమంలోనే తోపులాట జరిగినట్లుగా వైద్యులు చెబుతున్నారు.

దీనిపై వైద్యుల ఫిర్యాదుతో సోమవారం సంబంధిత అనుమానిత వ్యక్తులపై సోమవారం మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ ప్రశాంత్ కేసు నమోదు చేశారు. అయితే అరెస్టుచేయకపోవడంపై మంగళవారం వైద్యులు నల్ల బ్యాడ్జీలు, ధరించి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు దాడి చేయబోయిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున నినాదాలతో వైద్యులు, స్టాఫ్ నర్స్ , మెడికల్ కాలేజీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. దీనిపై డీఎస్పీ తిరుపతిరావు వైద్యులు స్టాఫ్ నర్స్ తో జరిగిన అన్యాయంపై న్యాయం జరిగే విధంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంత నచ్చ చెప్పినా వైద్యులు వినలేదు. దాదాపు గంటపాటు నిరసనను కొనసాగించారు.


