కాకతీయ, హుజురాబాద్:జమ్మికుంట మండలానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) కు తమిళనాడు హోసూర్ లోని ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సామాజిక సేవా రంగంలో డాక్టరేట్ అందజేయడం అభినందనీమని నిత్య జనగణమన రూపకర్త, ఖాజిపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పింగళి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రభును సన్మానించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభు తన సొంత లాభం కంటే సమాజానికి ఉపయోగపడే పనులను ఎంచుకొని నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు. పదేళ్లుగా నిరంతరం ప్రజా సేవలో ఉన్న ఆయనకు ఈ డాక్టరేట్ రావడం గర్వకారమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎం.డి. నసీరుద్దీన్, అన్వర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.


