కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిఫ్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఊహించని పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడగా..బీజేపీకి ఓ కొత్త రాజకీయ అస్త్రం దొరికినట్లయ్యింది.
అసలు ఏం జరిగిందంటే.. ఆ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం కర్నాటక విధానసభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత ఆర్. ఆశోక్ మాట్లాడుతూ..డీకే శివకుమార్ ఒకప్పుడు ఆర్ ఎస్ఎస్ నిక్కర్ ధరించారని వ్యాఖ్యానించారు. దీనికి సరదాగా స్పందించిన డీకే శివకుమార్ తన స్థానం నుంచి లేచి ఆర్ ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలే మాత్రుభూమి అంటూ పాట పాడటం ప్రారంభించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగానే బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు దాడి చేసింది.
ఈ వివాదంపై డీకే శివకుమార్ స్పందిస్తూ..తాను పుట్టుకతో కాంగ్రెస్ వాడినని..జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానంటూ స్పష్టం చేశారు. ఒక నాయకుడిగా నాకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసి ఉండాలన్నారు. అందుకే నేను వారి గురించి అధ్యయనం చేశానని బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో సరదాగా పాడానంటూ చెప్పారు. దీని రాజకీయ రంగు పులమవద్దని సూచించారు. దీంతో ఈ ఘటన కర్నాటక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసినట్లయ్యింది.
“Namaste Sada Vatsale Matribhume…”
– DK Shivakumar seen singing the RSS anthem yesterday in the Karnataka assembly
Rahul Gandhi & close aides of Gandhi Vadra family straight into ICU/Coma mode now.
After PM Modi spoke about the contribution of the RSS from the ramparts of… pic.twitter.com/SmB9tnGs5v
— Pradeep Bhandari(प्रदीप भंडारी)?? (@pradip103) August 22, 2025


