- ఆకట్టుకున్న విద్యార్థలు ప్రదర్శనలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థులతో ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భంగా ఈ పండుగను భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి ఇంటిలో ఆనందోత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. కార్యక్రమానికి ముందు శ్రీ మహాలక్ష్మి మాత విగ్రహానికి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


