టెక్స్టైల్ పార్కులో వరద ఉధృతిని పరిశీలించిన జిల్లాకలెక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ: మొంథా తుఫాన్ ప్రభావంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వరద ఉధృతి, మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె టెక్స్టైల్ పార్కు పరిధిలోని రాళ్లమట్టు వాగుపై జరుగుతున్న నదినాలా నిర్మాణ పనులను సమీక్షించారు. అదేవిధంగా పార్కులోని అంతర్గత రహదారులు,వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి,తుఫాన్ కారణంగా చోటుచేసుకున్న నష్టాన్ని అంచనా వేశారు.కలెక్టర్ మాట్లాడుతూ..తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై పూర్తి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. అవసరమైన పునరుద్ధరణ చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్,సంగెం తహసిల్దార్ రాజ్‌కుమార్, టెక్స్టైల్ పార్కు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



