కాకతీయ,కరీంనగర్: పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు అదేశాలు చేశారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 300 అర్జీలు రాగా జిల్లా కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. పరిశీలించారు. అనంతరం 300 అర్జీల సత్వర పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులకు అర్జీలను బదిలీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ..ప్రజావాణి లో వచ్చిన అర్జీలకు సత్వరమే సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కార చూపాలని అలాగే పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు


