కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా లోని కొరవి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల,వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆకస్మికంగ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని పరిసరాలు, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్లను పరిశీలించి ల్యాబ్లో పిల్లలు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్న విధానాన్ని (కంప్యూటర్ తరగతులను) ఆయన పరిశీలించారు.
ప్రభుత్వం కల్పించిన డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్ తరగతులను ఉపయోగించి విద్యార్థినీల యొక్క ప్రతిభలను వెలికి తీయాలన్నారు, సబ్జెక్టులో ప్రతిభ కనబరచడానికి టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులు ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, సాధారణ ప్రసవాల వివరాలు, స్టోర్ గది, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు, షెడ్యూల్ ప్రకారం క్షేత్రస్థాయిలో జరిగే వైద్య కార్యక్రమాలు శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏఎన్ఎం,ఆశా, అంగన్వాడి, కార్యకర్తలు కలిసి సమిష్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమాల శాఖ ల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు, కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, మండల వైద్యాధికారి విరాజిత, తదితరులు ఉన్నారు.


