కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపుర బొంబాయి స్కూల్ నుంచి నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డిఎఫ్ఎ చౌరస్తా, గీతా భవన్ చౌరస్తా బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ అమర వీరుల స్థూపం మీదుగా రాజీవ్ చౌక్ కరీ ముల్లాషా దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్దకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని అన్నారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా, జమున, తెహజీబ్ లను కాపాడటంలో ఎప్పుడూ తెలంగాణ ముందుంటుందన్నారు. ఈ వేడుకల్లో మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


