వికలాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, రాయపర్తి : వికలాంగులు, వృద్ధులకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50మందికి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిల్లు పంపిణీ చేశారు. మంగళవారం ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు వికలాంగులకు అందజేశారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నిరుపేదలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎర్రబెల్లి కొనియాడారు. అలాగే మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహా నాయక్ అధ్యక్షతన నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకునేలా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటీసీ రంగు కుమార్, కుందూరు రామ్ చంద్రారెడ్డి, లేతాకుల రంగారెడ్డి, పూస మధు, సురేందర్ నాయక్ రాథోడ్, చిలువేరు సాయి గౌడ్, గారె నర్సయ్య, ముద్రబోయిన సుధాకర్, చందు రాము, సతీష్, ఎల్లస్వామి, ఎండీ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.


