విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ.
ఉపాధ్యాయుడు సత్యనారాయణ సేవాభావం ప్రశంసనీయం..
కాకతీయ, కరీంనగర్ : విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు ఉదారత ప్రదర్శించాడు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్. సత్యనారాయణ తన సొంత ఖర్చుతో రూ.40,000 విలువైన క్రీడా దుస్తులను మొత్తం 104 మంది విద్యార్థులకు విరాళంగా అందజేశాడు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.పాఠశాల అభివృద్ధికి నా వంతు సహకారంగా క్రీడా దుస్తులు అందజేశాను. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, పాఠశాలకు,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. మా పాఠశాల జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని అన్నాడు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుగుణాకర్, ఏ ఏ పి సి చైర్‌పర్సన్ ఉమాశ్రీ, ఉపాధ్యాయులు బుర్ర నాగరాజు, శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


