ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్ల పంపిణీ
సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కాకతీయ, గజ్వేల్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ స్పెషల్ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిద్దిపేట ఫౌండేషన్ ఫౌండర్ సాదత్ నజీర్‌ను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జఖీయోద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగారావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర, సీనియర్ నాయకులు షేక్ హైదర్ పటేల్, శోకత్ అహ్మద్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


