కాకతీయ, ఇనుగుర్తి: జీవనాధార సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ నరసింగాపురం పాఠశాల లలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన ప్రతి పంట వల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు.
ఈ సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేయబడిన రాగులు, సజ్జల ద్వారా తయారు చేయబడిన రాగి జావా మా పాఠశాలకు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలానే సేంద్రియ ఎరువు ద్వారా అన్ని రకాల పంటలను పండించి రైతులకు సహకరించాలన్నారు.
నర్సింగాపురం గ్రామస్తులంతా సేంద్రియ ఎరువుల ద్వారానే అన్ని రకాల పంటలను పండించి మహబూబాబాద్ జిల్లాలో ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవనాధార సొసైటీ అధ్యక్షురాలు సాకృ బాయి, ఉపాధ్యాయులు నవీన్, గ్రామ రైతులు పాల్గొన్నారు.


