గద్దపాక డెయిరీ సభ్యులకు పాల క్యాన్ల పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గద్దపాక డెయిరీ సభ్యులకు పాల క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ.మహిళల ఆధ్వర్యంలో పాలకేంద్రం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గతంలో మూతపడ్డ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించి, మహిళల ఆధ్వర్యంలో సక్రమంగా పాల సేకరణ కొనసాగించడం ప్రశంసనీయమన్నారు. పాలకేంద్రం అధ్యక్షురాలు జక్కుల పద్మ, నిర్వాహకులు పలకల శ్యాంసుందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


