గట్టుదుద్దెనపల్లిలో మహిళా శక్తికి ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : మానకొండూరు నియోజకవర్గంలోని గట్టుదుద్దెనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందడి చేసింది. రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలలో భాగంగా ఈ పంపిణీ నిర్వహించారు.ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామ మహిళలకు చీరలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు హాజరై పంపిణీ చేపట్టారు.గ్రామంలోని మాజీ ఎంపిటిసి ఆకుల నర్సింగరావు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కనకం కుమార్, నాయకులు నీరటి మొగిలి, గొడిశాల రాజయ్య, బీరం మల్లేశం, నరెడ్ల శ్రీను, బందెల మహేందర్, గోండా తిరుపతి, కనకం రాజయ్య, పాండ్రాల శ్రీను, కనకం ఎల్లయ్య, మడ్డి చిరంజీవి, కిన్నెర శ్రీను, మేదరి తిరుపతి, గరిగంటి రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.స్వర్ణలత, స్రవంతి, చంద్రకళ, ఆకుల స్వప్న, మడ్డి రజిత, మంద మమత, రధారపు రజితతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు హాజరై చీరలు అందుకున్నారు. గ్రామంలో వేడుకలా కార్యక్రమం జరిగింది.


