గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ
అందించిన కూసుమంచి వర్తక సంఘం
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని వర్తక సంఘం సభ్యులు సొంత నిధుల నుండి సుమారుగా 60,000/- రూపాయలు విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ను ఇంచార్జ్ ఎంపీడీవో రాజారావు , సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ పంచాయతీ కార్యదర్శి రాళ్లబండి నీరజ లకు అందించారు.. వర్తక సంఘం సభ్యులకు కూసుమంచి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ వర్తక సంఘం అధ్యక్షులు చోడవరపు కృష్ణారావు , వర్తక సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్ , మాజీ సర్పంచులు గుండా దామోదర్ రెడ్డి , చెన్న మోహనరావు , వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య , అంతోటి వెంకన్న , అర్వపల్లి ఉపేందర్ గౌడ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు .


