- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్
కాకతీయ, ఇనుగుర్తి: సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్ అన్నారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో డీలర్ సురేష్ చౌక ధరలు దుకాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వ బియ్యం సంచులను లబ్ధిదారులకు నాయకులతో కలిసి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సన్న బియ్యం పథకంతో ప్రతి పేదవాడు మూడు పూటల అన్నం తినగలుగుతున్నారని కొనియాడారు. పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బషీర్, దిశ కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబు రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొట్టం రాము, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దేవులపేల్లి వెంకన్న, ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షుడు నాగెల్లి సుధీర్, సందీప్, డీలర్ సురేష్, కాంగ్రెస్ పార్ట్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


