కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 28వ డివిజన్ పరిధి ముంపు ప్రాంతాల బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ మేరకు సంతోష్ మాత కాలనీల్లో బుధవారం కార్పొరేటర్ గందె కల్పన నవీన్ ఆధ్వర్యంలో కమిషనర్ చేతుల మీదుగా సుమారుగా 450 కుటుంబాలకు 16 రకాలు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరై అభినందించారు. ఈ సందర్భంగా గందే కల్పన నవీన్ మాట్లాడుతూ కమిషనర్ తో డివిజన్ లోని ప్రధాన సమస్యల గురించి చర్చించగా కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు. మార్వాడి సమాజ్ వారు వరదలు వచ్చిన సమయంలో కాలనీ వాసులందరికీ ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత డివిజన్ లోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రాజేష్, శంకర్ సింగ్, చకిలం సతీష్, బగల్ కళ్యాణ్, నరసింహారెడ్డి, కనకాచారి, బోయిని రవి, పొకల రాము, తదితరులు పాల్గొన్నారు.


