నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆరు సొసైటీ కేంద్రాలలో ఎనభై మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశానూసారం రైతులకు రైతు భరోసా డేటా ప్రకారం ముందస్తు సమాచారాన్ని సొసైటీల ద్వారా, వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్థానిక సిబ్బంది ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం నెల్లికుదురు మండలం లో ఆరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కేంద్రాల లో ఎనభై మెట్రిక్ టన్నుల యూరియాను ఏకకాలం లో రైతులకు సక్రమంగా పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమం లో తహసిల్దార్ నరేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమార్, ఎస్సై రమేష్ బాబు, ఏ ఈ ఓ లు, పంచాయితీ కార్యదర్శులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధికారులు, సిబ్బంది , రైతులు, తదితరులు పాల్గొన్నారు.


