మార్కెట్ లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి మల్లేశం
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వేసవికాలంలో ఎండ తీవ్రతను ఎదురుకోవడానికి గాను, మార్కెట్ కు లావాదేవీల నిమిత్తం వచ్చే రైతులు, వ్యాపారులు, మార్కెట్లో పనిచేసే గుమస్తాలు, దాడువాయిలు, హమాలీ కార్మికుల కోరిక నిమిత్తము మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు కటకం పెంటయ్య, మార్కెట్ అసిస్టెంట్ సెక్రెటరీ రాజేందర్, సూపర్వైజర్లు గంగాధర్, మురళి, సాగర్, శ్రీనునాయక్, ఛాంబర్ కార్యవర్గ సభ్యులు కైలాస హరినాథ్, గౌరిశెట్టి శ్రీనివాస్, ఎక్స్ పొర్ట్ సెక్షన్ కార్యదర్శి గోపాల సత్యనారాయణ, బబ్బుల అశొక్, గుమస్తా సంఘం అధ్యక్షులు ఇనుముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


