కాకతీయ, నల్లబెల్లి: ప్రతీ విద్యార్థి క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే, ఆ విద్యే వారి ఎదుగుదలకు పునాదిగా నిలుస్తుందని ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు లడే రవీందర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీ-శాట్ ఛానల్ ద్వారా ప్రసారమైన విలువల విద్య అంశాన్ని పాఠశాల విద్యార్థులు చూడటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ అవసరత, యోగా సాధన వల్ల లాభాలు, విద్య ప్రాముఖ్యత, డ్రగ్స్ వంటివాటితో వచ్చే ప్రమాదాలు అనే అంశాలపై అవగాహన కల్పించారని ఆయన తెలిపారు. విలువ ఆధారిత విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బద్రీనాథ్, శోభారాణి, గోవర్ధన్, రాంబాబు, రవికుమార్, పాల్గొన్నారు.


