కాకతీయ, వరంగల్ సిటీ: దేశంలో గాని రాష్ట్రంలో విపత్తు సంభవించే ముందే ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి, విపత్తు సంభవించినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించడానికి మరియు ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించడానికి వేగంగా స్పందించడం చాలా ముఖ్యం. ఈ పనులన్నీ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో జరుగుతాయి. ఈ డిపార్ట్మెంట్ వరంగల్ లో మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయాలి.
వరంగల్ కి భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, కానీ వరంగల్ లో అలాంటి చర్యలు ఏమి కనబడడం లేదని కనీసం మా లోతట్టు ప్రాంతాలకు ముందస్తు సూచనలు కూడా ఇవ్వడం లేదని పలు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న, వరంగల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిన డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ టీం మాత్రం మాకు సంబంధం లేదు అన్నట్టుగా సహాయక చర్యలో పాల్గొనడం లేదు, పలు కాలనీవాసులు ఇప్పటికీ వరద నీటిలోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కానీ మున్సిపల్ అధికారులు తగు సహాయకచర్యలు తీసుకోవడం లేదని పలు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, రిజిస్టర్ అండ్ రెస్పాన్స్ టీం సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాలని వరంగల్ ముంపు ప్రాంతవాసులు వేడుకుంటున్నారు.


