ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం
కాకతీయ, గీసుగొండ: ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన గీసుగొండ మండలంలోని మచ్చాపూర్లో చోటుచేసుకుంది. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, మచ్చాపూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి సిద్ధార్థ (23) తేదీ 18వ తేదీ రాత్రి ఇంటి పనుల విషయంపై కుటుంబ సభ్యులతో స్వల్ప వాగ్వాదం అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు.అయితే 19వ తేదీ తెల్లవారుజాము నుంచి సిద్ధార్థ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో గాలించినా అతని ఆచూకీ లభించక పోవడంతో సిద్ధార్థ తండ్రి అక్కినపల్లి హయగ్రీవ చారి గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన విద్యార్థి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శోధన చర్యలు వేగవంతం చేసినట్లు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. ప్రజలు ఎవరైనా అతని గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే గీసుగొండ పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


