కాకతీయ, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ దారులకు, వికలాంగులకు పెన్షన్లు వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మండల డిప్యూటీ ఎమ్మార్వో రమేష్ కు మెమోరాండం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6000, వయోవృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారం రాగానే పెన్షన్ దారులను మరిచిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్ దారులకు, వికలాంగులకు పెన్షన్ అందించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కట్ల రాజశేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వికలాంగులు, వయోవృద్ధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.


