epaper
Saturday, November 15, 2025
epaper

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్: సీఎం చంద్రబాబు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్సు సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్ -డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్ తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ – గవర్నెన్సు అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం అన్నారు.

ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చు కోగలుగుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం అన్నారు.

సంజీవని ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అమలుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం సూచించారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని సీఎం తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాలన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందిస్తున్నామని త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశానికీ అమలు చేసేందుకు అస్కారం ఉందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏమేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

గతంలో బీపీఓ విధానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఇప్పుడు కొన్ని యాప్ ల ద్వారా వచ్చే ఆర్ధిక ప్రయోజనాలు విదేశాలకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్నాలజీలో మరో కీలకమైన అంశంగా సెమికండక్టర్ల పరిశ్రమ పైనా దృష్టి పెట్టాలని అన్నారు.

ఓ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించటంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img