డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది
కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందుతుందని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ను శుక్రవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రొజెక్టర్ను అందుబాటులోకి తెచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని విద్యార్థుల్లో విషయ జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను ఉపయోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం పుష్పనీలా, పి ఉపేందర్, పి.సంధ్య, ఉమారాణి, ఉషరాణి, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ సుధాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


