epaper
Monday, March 2, 2026
epaper

నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు..

నాగార్జున కుటుంబంలో డిజిటల్ అరెస్టు..
2 రోజులు ఇంట్లోనే న‌ర‌కం!
అక్కినేని ఇంట్లో డిజిటల్ అరెస్టు కలకలం
రెండు రోజులు నిర్బంధం
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన నాగార్జున‌

కాక‌తీయ‌, సినిమా : ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కొత్త తరహా మోసం.. డిజిటల్ అరెస్టు. రోజురోజుకు డిజిట‌ల్ అరెస్టుకు గుర‌వుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ జాబితాలో మేమూ ఉన్నామంటూ సంచ‌ల‌న విష‌యాన్ని రివీల్ చేశారు అక్కినేని నాగార్జున‌. తెలంగాణ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ తో తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చిన పైరసీ నెట్‌వర్క్ కుప్ప‌కూలింది.

ఈ నేపథ్యంలోనే సోమ‌వారం టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు కలిసి సీపీ సజ్జనార్‌ను కలుసుకున్నారు. పైరసీని అరికట్టేందుకు పోలీసు విభాగం చేస్తున్న పోరాటాన్ని వారు అభినందించారు. అనంత‌రం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నియాంశంగా మారాయి. ర‌వి కేసులో వెలుగుచూస్తున్న వివరాలు డిజిటల్ అరెస్టు మోసాలతో కూడా సంబంధం ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అంశంపై నాగార్జునమాట్లాడుతూ.. `మా కుటుంబ సభ్యుల్లోనూ ఒకరు డిజిటల్ అరెస్టు బారిన ప‌డ్డారు. రెండు రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురై న‌ర‌కం చూశారు.. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే మోసగాళ్ల జాడ మాయ‌మైంది,” అని వెల్లడించారు. ఇంత పెద్ద సెలబ్రిటీల కుటుంబానికే ఇలా జరిగితే, సాధారణ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని నాగార్జున ప్ర‌శంసించారు. `ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత చెన్నై నుంచి తన స్నేహితుడు కాల్ చేసి, `మేము చేయలేని ప‌ని మీరు చేశారు అని చెప్ప‌డం సంతోషాన్ని ఇచ్చింది. ఐబొమ్మ వంటి పైరసీ వెబ్‌సైట్లు ప్రజలకు ఉచిత సినిమాలు చూపించాలనుకోవడం అనేది వారి మోసానికి తొడుగులాంటిది.. అంతర్జాతీయ ముఠాలు ఈ సైట్ల ద్వారా డేటా సేకరిస్తున్నాయి. ఆ డేటాతో పెద్ద స్థాయిలో మోసం చేస్తున్నారు, ఒక్క ఇమ్మడి రవి వ‌ద్ద‌ 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది, ఈ వ్యవహారం కేవలం రూ.20 కోట్లు కోసం కాదు.. దీని వెనక వేల కోట్లు దోచే భారీ ప్లాన్ ఉంది` అంటూ నాగార్జున హెచ్చ‌రించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img