కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది. బీర్ల ఐలయ్య వర్సెస్ మందుల సామెల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నాశనం చేసే కుట్రలో ఆయన పాల్పడ్డారని, మదర్ డైరీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో నేతలు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.
మందుల సామెల్ ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టానికి గురి కాకుండా, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు జాగ్రత్తగా ఎన్నికల్లో భాగంగా ఉండాలని ప్రజలకు సూచించారు..బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే, బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని స్పష్టం చేశారు.
ప్రలోభాలకు లొంగకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు, కార్యకర్తలు మీకు సరైన బుద్ధి చెబుతారన్నారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని ఎమ్మెల్యే సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని రక్షించడం కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు ఒకే లక్ష్యం కోసం పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.


