epaper
Monday, March 2, 2026
epaper

అను‘కొన్నవే’ వచ్చినయా?

అను‘కొన్నవే’ వచ్చినయా?
వరంగల్ బల్దియాకు చేరుకున్న కొత్త వాహనాలు
గతంలో కోట్ చేసిన మోడల్‌కు బదులు మరొకటి సరఫరా
వద్దని వెనక్కి పంపిన జీడబ్ల్యూఎంసీ
మళ్లీ తాజాగా కోరిన వాహనాలే చేరవేత!
కాకతీయ దినపత్రిక అక్షర పోరాట ఫలితం!!

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) చివరికి తాను అనుకున్నదే సాధించింది. ఒకసారి మోసపోయినా వెంటనే అప్రమత్తమైన బల్దియా అధికారులు సరైన మోడల్ వాహనాలను రప్పించడంలో విజయవంతమయ్యారు. కొంతకాలం క్రితం బల్దియా అవసరాల నిమిత్తం టాటా ఏస్ గోల్డ్ వాహనాల సరఫరా బాధ్యతలను హకా అనే ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఆ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా సాధారణ టాటా ఏస్ వాహనాలను పంపించి బల్దియాను మోసం చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన బల్దియా అధికారులు వెంటనే స్పందించి, సరఫరా చేసిన వాహనాలను తిరస్కరించారు. కోట్ చేసిన మోడల్‌కు భిన్నంగా వాహనాలు పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒప్పందం ప్రకారం టాటా ఏస్ గోల్డ్ వాహనాలనే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గతంలో పంపిన వాహనాల ధరల్లో తేడా ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు.

కాకతీయ దినపత్రిక కథనంతో కదిలిన వ్యవహారం

బల్దియాకు హకా ఏజెన్సీ చేసిన మోసాన్ని కాకతీయ దినపత్రిక ప్రత్యేక కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పత్రికా కథనాల అనంతరం అధికారులు మరింత అప్రమత్తమై, సరైన వాహనాల సరఫరాపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ బల్దియాకు సుమారు 15 వరకు కొత్త వాహనాలు చేరాయి. అవి బల్దియా కోరిన టాటా ఏస్ గోల్డ్ మోడల్ వాహనాలేనని అధికారులు చెబుతున్నారు. ఉదయం వేళ బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట కొత్త వాహనాలు బారులుగా నిలబడడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమిత్తం వాటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గత అనుభవాల దృష్ట్యా వచ్చిన వాహనాలు నిజంగానే కోరిన మోడల్‌వేనా? లేక పాత తరహా వాహనాలకే ‘గోల్డ్’ స్టిక్కర్లు అతికించారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో మోసం చేసిన ఏజెన్సీ మరోసారి అదే తరహా ప్రయత్నం చేయదనే గ్యారంటీ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈసారి మాత్రం అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ప్రతి వాహనం స్పెసిఫికేషన్లను ధృవీకరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కాకతీయ దినపత్రిక అక్షర పోరాటంతో బల్దియా అనుకున్న మోడల్ వాహనాలు రావడం సానుకూల పరిణామంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img