ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కాకతీయ, ఖిలావరంగల్ : వరద నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేటర్ మరుపల్లి రవి ఆధ్వర్యంలో గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం బాధితుల తరఫున మరుపల్లి రవి తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


