12వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభం
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని మానసపల్లి గ్రామం 12వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు వార్డు సభ్యురాలు కొయ్యల కృష్ణవేణి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఆమె బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజాసేవలో చురుగ్గా మారారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాల్వలను స్వయంగా పరిశీలించి శుభ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు చెప్పిన సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. స్థానికులు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు


