- అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు
- మంథని క్యాంపు కార్యాలయంలో సమీక్ష
- గోదావరి బ్రిడ్జి నిర్మాణం, శ్రీపాద రింగ్‌రోడ్ పనుల పురోగతిపై దిశానిర్దేశం
కాకతీయ, మంథని : మంథని పట్టణంలోని గోదావరి బ్రిడ్జి నిర్మాణం, శ్రీపాద రింగ్‌రోడ్ పనుల పురోగతిపై మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు మంథని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి, రెవెన్యూ శాఖల అధికారులు, బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, శ్రీపాద రింగ్‌రోడ్ పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.
ఇప్పటికే మంజూరు అయిన రూ.4.50 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బి అతిథి గృహానికి తగిన స్థలాన్ని తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని సూచించారు. మంథని మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో మంజూరైన అన్ని కులాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం తరఫున గుర్తించి వెంటనే కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. హమాలీ సంఘం, ఆటో కార్మికులకు ఇంటి నిర్మాణానికి అనువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి అందజేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ, రెవెన్యూ డివిజన్ అధికారి, ఎమ్మార్వో, జేఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


