కాంగ్రెస్తో అభివృద్ధి
మంత్రులు పొన్నం.. తుమ్మల
కాకతీయ, హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుల గణన చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న మాదిగ ఉప కులాల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 9800 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ధనికులతో సమానంగా పేదలు సైతం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రెండు సంవత్సరాల్లో 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ధాన్యం పండించడం లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. పంజాబ్ ను అధిగమించి పంటల మొదటి స్థానంలో ఉంది.. ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది.సన్న వడ్లు కి 500 బోనస్ ఇస్తున్నాం రైతు భరోసా ఇచ్చాం.. రైతు రుణమాఫీ 21 వేల కోట్లు చేశాం.22 వేల కోట్లతో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.చేనేత కార్మికుల రుణమాఫీ చేశాం.కంటోన్మెంట్ లో బుద్ధి చెప్తారని అన్నారు.. ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ను గెలిపించారు.జూబ్లీహిల్స్ లో మీ పని ఐపోయింది అన్నారు.. 25 వేల మెజారిటీ తో కాంగ్రెస్ ను గెలిపించారు.సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్మరు.. 100 శాతం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు.మీ కాలంలో చేసిన పాపలు తప్ప రెండు సంవత్సరాల్లో పేదలకు అన్నం పెట్టాం. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం వ్యవసాయ సబ్సిడి అందిస్తున్నాం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసిన నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు. తెలంగాణ ప్రజలను అగమ్యగోచరంలోకి నెట్టారు. ప్రజలు ఇచ్చిన మనోధైర్యం శక్తితో అండగా ఉంటాం. యావత్ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీ లు కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని కోరారు. కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


