గ్రామాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి
ఎమ్మెల్యే డా.మురళి నాయక్
కాకతీయ,నెల్లికుదురు : రాష్ట్రంలోనే కాదు గ్రామాలలో నూ కాంగ్రెస్ గెలిస్తే వేగంగా అభివృద్ధి జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం,కొత్త రేషన్ కార్డులు,200 యూనిట్లు ఉచిత విద్యుత్,మహిళలకు బస్సు ఫ్రీ వంటి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి దీవించాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండలంలోని మేచరాజుపల్లి,ఎర్రబెల్లి గూడెం,రత్తిరాం తండా, రామన్నగూడెం,జామ తండా, హనుమాన్ నగర్ తండా,రాజుల కొత్తపల్లి,నైనాల,నెల్లికుదురు,బ్రాహ్మణకొత్తపల్లి,రావిరాల,మదనతుర్తి, శ్రీరామగిరి,బంజర,నరసింహుల గూడెం,ఆలేరు, వావిలాల గ్రామాల సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే సోమవారం డిసిసి అధ్యక్షులు ఉమా మురళి నాయక్ తో కలిసి ప్రచారం లో పాల్గొన్నారు. సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ వంటివని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సత్వర అభివృద్ధికి సర్పంచు వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, సత్యపాల్ రెడ్డి,బాలాజీ,లక్ష్మారెడ్డి జిల్లా, మండల నాయకులతో పాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


