కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది పడిందని, హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. శనివారం హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3, 2వ వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ మౌలిక వసతులు, పేదల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రకటించాలని ప్రజలను పాడి కౌశిక్ రెడ్డి కోరారు.


