అభివృద్ధి.. సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో ఆదరణ
– బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
– పార్టీలో కొత్త,పాత తారతమ్య బేధం ఉండకూడదు
– ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
– నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తాం
– పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఆదరణ పెరుగుతుందని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మండలంలోని మహబూబ్ నగర్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీని వీడి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం,పార్టీలో కొత్త పాత అనే తారతమ్య భేదం లేకుండా అందరూ పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు.కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా తగిన గుర్తింపును అందిస్తామన్నారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువ అయ్యేలా చూస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొందేందుకు మాపై బురద చల్లడం సిగ్గుచేటని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, మాజీ టీపీసీసీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి, సరికొండ కృష్ణారెడ్డి,కుంట రమేష్,బొమ్మెర కళ్యాణ్ గౌడ్,వనజారాణి, పాల్వంచ కోటేశ్వర్,నూరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



