- బీజేపీ మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్
కాకతీయ, కరీంనగర్ : శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన బోరుబావిని శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మౌలిక వసతులు సక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో ఎంపీ నిధుల ద్వారా బోరుబావి ఏర్పాటు జరిగిందని అనిల్ తెలిపారు. గ్రామస్తులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెడ్డి నరేందర్, నాయకులు కొయ్యడ అశోక్, మందడి జగ్గారెడ్డి, దాసరి సంపత్, ఎల్కపెల్లి సంపత్, జానపట్ల రాజిరెడ్డి, వీరార్జున్, జాలి రమణారెడ్డి, నాంపెల్లి రవి, మాజీ ఉపసర్పంచ్ మల్లేశం, నూనె పోశయ్య, భూమయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


